మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉంది. అందుకే ఏసీబీ అధికారులు కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీమ్ ఎందుకు?.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి. దొంగలకు అండగా ఉంటారా, ప్రజలకు అండగా ఉంటారా? హెచ్ఎమ్ డీఏలోని ఆస్తులను నీకు, మీ నాన్న కేసీఆర్ కట్టబెట్టాడా కేటీఆర్?. బాధ్యత గల శాసన సభ్యునిగా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. మీ అవినీతిలో రూ. 55 కోట్లు చిన్నవి కావొచ్చు. కానీ ప్రజల సొమ్ము దోచుకుంటే వదిలే ప్రసక్తే లేదు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలి పెట్టదు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతుండు. తప్పు చేయకపోతే కేటీఆర్ ఎందుకు విచారణకు హాజరుకాలేదు. డ్రామారావు రాజకీయ లబ్ది కోసమే విచారణకు పోలేదు. దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అంటూ వెంకట్ పేర్కొన్నారు.








