Mahaa Daily Exclusive

  పకడ్బందీగా విచారణ చేపట్టాలి –సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ

Share

మిర్యాలగూడ,మహా ;రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ల అమలుకు ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పకడ్బందీగా విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కూలీ కుటుంబాలకు రెండు విడతలుగా ఏడాదికి రూ. 12 వేలు అందించనుందన్నారు. ఈ పథకంతో పాటు ఇతర స్కీమ్ లకు ఈ నెల 16 నుంచి 20 వరకు ఫీల్డ్ ఎంక్వయిరీ… 21వ తేదీ నుంచి 24 వరకు గ్రామ సభల నిర్వహణతో పాటు సేకరించిన వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను 25వ తేదీ వరకు కంప్లీట్ చేస్తారన్నారు. అదేరోజు జిల్లా మంత్రి తో లబ్ధిదారుల జాబితా ఆమోదం పొందిన అనంతరం ఈనెల 26 నుంచి ఆయా స్కీమ్ ల సాంక్షన్ ఆర్డర్ లను ఇస్తారని చెప్పారు. అర్హులకు మాత్రమే స్కీమ్ లను వర్తింపచేయాలని చేయాలన్నారు.అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇండ్లను కోల్పోయిన వారిలో 116 మంది ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించి టీఎస్ జెన్కో బోర్డుకు అప్రూవల్ కోసం పంపినట్లు చెప్పారు. అదేవిధంగా భూములను కోల్పోయిన వారిలో 525 కుటుంబాల్లో 400 ఫ్యామిలీలు అప్లికేషన్ చేసుకోగా… వీరిలో 220 మందికి అర్హత పొందారని తెలిపారు. భూములు కోల్పోయిన వారిలో కొంతమంది అప్లికేషన్ చేసుకునేందుకు నేటికి స్పందించలేదని ఈ ప్రక్రియ ఈనెల 16 తో ముగుస్తుందని చెప్పారు.సమావేశంలో తహశీల్దార్ హరిబాబు ఉన్నారు.

Latest