Mahaa Daily Exclusive

  ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి..!

Share

ఆదిభట్ల సెప్టెంబర్ 3 మహా:
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం, రావిర్యాల సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్-13 వద్ద, గురువారం తెల్లవారుజామున, శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు ఉక్కు కడ్డీలతో వెళ్తున్న భారీ వాహనాన్ని, వెనుక నుంచి కూరగాయలతో వచ్చిన బొలెరో ఢీకొట్టడంతో, బొలెరో డ్రైవర్ శివ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Latest