- బీటెక్ విద్యార్థులచే ర్యాగింగ్ కు గురవుతున్న మెడికల్ విద్యార్థులు
- ప్రభుత్వం స్పందించి హాస్టల్ వసతి కల్పించాలి
కాలేజ్ గేటు ముందు నిరసన: మెడికల్ విద్యార్థులు
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 3 మహా:
మెడికల్ కాలేజీలో హాస్టల్ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న విద్యార్థినులు. మహేశ్వరంకు చెందిన మెడికల్ కాలేజ్ ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్లో మహేశ్వరం మెడికల్ కాలేజీ అద్దె ప్రాతిపదికన కొనసాగుతోంది. విద్యార్థులు ప్రతిరోజు ప్రధాన గేటు నుంచి క్యాంపస్లో ఉన్న కాలేజీ వరకు వారి యొక్క వాహనాలను తీసుకొని వెళ్లేవారమని, ప్రస్తుతం కాలేజి యాజమాన్యం విద్యార్థుల వాహనాలను లోపలికి అనుమతించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క మెడికల్ కాలేజ్ బీటెక్ క్యాంపస్ లో ఉండడంతో బీటెక్ విద్యార్థులు మెడికల్ కాలేజీ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ వసతి, కాలేజీ భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.








