Mahaa Daily Exclusive

  ఆంధ్రా పేపర్స్‌పై పవన్‌ ఫైర్‌..! పన్నుల బకాయిలు, కాలుష్యంపై కొరడా..!

Share

  •  పన్నుల బకాయిలు, కాలుష్యంపై కొరడా!
  •  2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదా?
  •  రూ.21.34 కోట్ల బకాయిలపై ఆగ్రహం.
  •  పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యం సృష్టిస్తే సహించం.
  •  బాధ్యతారాహిత్యంపై కఠిన చర్యలు.
  •  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మహా:

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, స్థానిక సంస్థల ఆదాయాల విషయంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్స్‌ పరిశ్రమపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు పాటించడంతో పాటు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను కూడా సక్రమంగా చెల్లించాలని స్పష్టం చేశారు. ఆంధ్రా పేపర్స్‌ విషయంలో పన్నుల బకాయిలు, గోదావరి కాలుష్యం అంశాలను ప్రస్తావిస్తూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రూ.21.34 కోట్ల బకాయిలపై సీరియస్‌

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించిన వివరాల ప్రకారం.. ఆంధ్రా పేపర్స్‌కు సంబంధించి రూ.21.34 కోట్ల మేర స్థానిక పన్నుల బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2016 తర్వాత పన్నుల చెల్లింపుపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే పన్నులే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, సిబ్బంది జీతాలు వంటి కనీస వసతులకు కీలక ఆదాయ వనరులని ఆయన పేర్కొన్నారు. పన్నులు చెల్లించకుండా ప్రజలకు పరోక్షంగా ఇబ్బందులు కలిగించే పరిస్థితిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

Latest