Mahaa Daily Exclusive

  ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల..! 11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ..

Share

  • 11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
  • 13 న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటవ
  • 14 న గెజిట్ విడుదల

అమరావతి. మహా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్‌ విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై నేటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.

ఆ తర్వాత పురపాలక డైరెక్టర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్ 13న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటన వెలువడనుంది. మరుసటి రోజు, అంటే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ అధికారిక గెజిట్‌లో వార్డుల పునర్విభజన ప్రకటనను ప్రచురిస్తారు. ఈ ఆదేశాలు జీవీఎంసీ (విశాఖపట్నం), విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, చిత్తూరు వంటి రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేషన్లన్నింటికీ వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

39 పట్టణ స్థానిక సంస్థలలో (యూఎల్ బీ) వార్డుల పునర్విభజన పూర్తయ్యే కాలపరిమితి..

పార్వతీపురం: 03.09.2026
సాలూరు: 03.09.2026
నర్సీపట్నం: 03.09.2026
విజయవాడ: 03.09.2026
రామచంద్రపురం: 03.09.2026
జగ్గయ్యపేట: 03.09.2026
మాచర్ల: 03.09.2026
వినుకొండ: 03.09.2026
సత్తెనపల్లి: 03.09.2026
మార్కాపురం: 03.09.2026
చీరాల: 03.09.2026
చిత్తూరు: 03.09.2026
అనంతపురం: 03.09.2026
కర్నూలు: 03.09.2026
ప్రొద్దుటూరు: 03.09.2026
రాయచోటి: 03.09.2026
రాయదుర్గం: 03.09.2026
పుట్టపర్తి: 03.09.2026
బద్వేల్: 03.09.2026
నగరి: 03.09.2026
పుత్తూరు: 03.09.2026
కదిరి: 03.09.2026
ఎర్రగుంట్ల: 03.09.2026
జమ్మలమడుగు: 03.09.2026
పలమనేరు: 03.09.2026
తిరుపతి: 03.09.2026
జీవీఎంసీ (జివిఎంసి): 08.09.2026
ఏలూరు: 08.09.2026
మచిలీపట్నం: 08.09.2026
పెడన: 08.09.2026
పిఠాపురం: 08.09.2026
ఒంగోలు: 08.09.2026
చిలకలూరిపేట: 15.09.2026
నెల్లూరు: 15.09.2026
గుంటూరు: 08.09.2026
కడప: 08.09.2026
ధర్మవరం: 08.09.2026
తాడిపత్రి: 08.09.2026
నంద్యాల: 08.09.2026

Latest