Mahaa Daily Exclusive

  వెలిగొండ టన్నెల్‌-2కు కీలక ముందడుగు..! మేఘా ఇంజినీరింగ్‌కు పనులు అప్పగింత..

Share

• టీబీఎం తొలగింపునకు రూ.11.63 కోట్లు.
• మేఘా ఇంజినీరింగ్‌కు పనులు అప్పగింత.

అమరావతి:మహా.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి మరో కీలక అడ్డంకి తొలగనుంది. ప్రాజెక్టులోని రెండో సొరంగంలో చిక్కుకుపోయిన భారీ టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం)ను తొలగించి బయటకు తరలించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పనుల కోసం రూ.11.63 కోట్లు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. టీబీఎం తొలగింపు పనులను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో టన్నెల్‌-2లో మిగిలిన పనులను పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి మార్గం మరింత సుగమమైంది.

వెలిగొండ ప్రాజెక్టులోని రెండో సొరంగం సుమారు 7.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ సొరంగం తవ్వకం పనులను మేఘా ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో పూర్తి చేసి 2024 జనవరిలో బ్రేక్‌త్రూ సాధించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రెండు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్లను వినియోగించారు. మొదటి సొరంగం సుమారు 3.6 కిలోమీటర్లు, రెండో సొరంగం సుమారు 7.5 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి.

అయితే రెండో సొరంగంలో గతంలో నిలిచిపోయిన టీబీఎం పూర్తిగా బయటకు రాకపోవడంతో ప్రాజెక్టు చివరి దశ పనుల్లో సమస్య కొనసాగింది. భారీ యంత్రాన్ని సొరంగం నుంచి బయటకు తీయడం సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ కావడంతో పాటు, దాని తొలగింపుపై న్యాయపరమైన వివాదాలు కూడా తలెత్తాయి. దీంతో సొరంగం నిర్మాణం పూర్తయినప్పటికీ టీబీఎం వ్యవహారం ప్రాజెక్టు పూర్తి ప్రక్రియలో కీలక అవరోధంగా మారింది.

Latest