Mahaa Daily Exclusive

  తొలగించినచోటే బిగించిన విద్యుత్ మీటర్…

Share

  • తొలగించినచోటే బిగించిన విద్యుత్ మీటర్…
  • అత్యుత్సాహమే తప్ప ఆరోపణలలో వాస్తవం లేదు….
  • వాసవం తెలుసుకున్న అధికారులు మీటర్ బిగింపు
  • జర్నలిస్టుల వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహరించవద్దు..

ఇబ్రహీంపట్నం జూలై 20 మహా:
ఆదిభట్ల సర్కిల్ బొంగులూరు గ్రామం ఇందిరమ్మ కాలనీలో ఓ పత్రికలో వచ్చిన విద్యుత్ మీటర్ తొలగింపు అనే కథనంలో వాస్తవం లేదు. తన పరిధి కాకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ అత్యుత్సాహంతో ఈ యొక్క వార్తను రాయడం జరిగింది. సోమవారం విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు తొలగించిన చోటే విద్యుత్ మీటర్ను బిగించడం జరిగింది. ఒక విలేఖరి పై అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనంలో వాస్తవం లేదని తేలిపోయింది. అత్యుత్సాహంతో వార్త కథనాన్ని ప్రచురించడం జరిగిందని బాధితులు అన్నారు…. తమపై తప్పుడు అభియోగం మోపి, ఒక పత్రిక పేరును ఉచ్చరిస్తూ, వాస్తవం లేని వార్త రాయడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇకముందైన వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, అవివేకంతో వార్తలు రాసి జర్నలిస్టుల వృత్తికి మచ్చ తేవద్దని సూచించడం జరిగింది.